కర్నూలు జిల్లాలో దారుణం.. హత్య చేసి నేరుగా పోలీస్ స్టేషన్‌కే..

 

కర్నూలు జిల్లాలో దారుణం.. హత్య చేసి నేరుగా పోలీస్ స్టేషన్‌కే..

కర్నూలు జిల్లాలో దారుణ హత్య చోటు చేసుకుంది. వివాహేతర సంబంధం ఓ వ్యక్తి ప్రాణాలను బలిగొంది. అతికిరాతంగా చంపేసి నిందితుడు పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.



ఎమ్మిగనూరు పట్టణ పరిధిలోని స్థానిక LLC కాలువ దగ్గర హనుమపురం గ్రామానికి చెందిన గొల్ల గోవింద్ (35) అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. రామాంజనేయులు (40) అనే వ్యక్తి అతడిని అతి కిరాతకంగా కొడవలితో నరికి చంపేశాడు. హత్య అనంతరం నిందితుడు నేరుగా రూరల్ పోలీస్ స్టేషన్‌కు వచ్చి లొంగిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతుడిది పెద్దకడుబూర్ మండలం హనుమపురం గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. వివాహేతర సంబంధం నేపథ్యంలోనే హత్య జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

Comments

Popular posts from this blog

పెళ్లికాకున్నా.. పిల్లలను దత్తత తీసుకుంటా

తిరుపతిలో మళ్లీ భారీ వర్షాలు

ఐపీఎల్ 2022లో బ్రావో ఉంటాడు: CSK