Posts

Featured post

యువకుడిపై యాసిడ్ పోసిన మహిళ !!!!!!!!!

Image
యువకుడిపై యాసిడ్ పోసిన మహిళ కేరళకు చెందిన షీబ్రా తనకు పెళ్లై, ఇద్దరు పిల్లలున్న విషయాన్ని దాచిపెట్టి FBలో పరిచయమైన అరుణ్ ప్రేమాయణం నడిపింది. పెళ్లి చేసుకోవాలని భావించింది. ఆమెకు పెళ్లైన విషయం తెలిసి, వివాహానికి నో చెప్పాడు అరుణ్. పెళ్లి చేసుకోకుంటే పంచాయితీ పెట్టి పరువు తీస్తానని డబ్బులు డిమాండ్ చేసింది. అయినా అరుణ్ తగ్గలేదు. దీంతో కోపం పెంచుకున్న షీబ్రా అతడిపై యాసిడ్ పోసింది. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. for more information visit my blog--:  click here

వెళ్తున్న కారులో యువతి(21)పై: గ్యా0 గ్ రేప్

 దారుణం: వెళ్తున్న కారులో యువతి(21)పై:  గ్యా0 గ్ రేప్ UPలోని మధురలో దారుణం జరిగింది. తోడు వచ్చిన స్నేహితుడే మరో వ్యక్తితో కలిసి యువతిపై అత్యాచారం చేశాడు. మధురకు చెందిన బాధితురాలు మంగళవారం SI పరీక్ష రాసేందుకు ఆగ్రా వెళ్లింది. తోడుగా ఫేస్బుక్లో ఫ్రెండైన తేజ్వర్ అనే వ్యక్తిని తీసుకెళ్లింది. ఎగ్జామ్ తర్వాత కారులో వస్తుండగా మరో వ్యక్తితో కలిసి తేజ్వీర్ తనపై అత్యాచారం చేసినట్లు బాధితురాలు పేర్కొంది. ఆమె ఫిర్యాదుతో పోలీసులు తేజ్వర్ను అరెస్ట్ చేశారు.

తిరుపతిలో మళ్లీ భారీ వర్షాలు

Image
  తిరుపతిలో మళ్లీ భారీ వర్షాలు AP: తిరుపతిలో మళ్లీ భారీ వర్షాలు కురుస్తున్నాయి. రోడ్లన్నీ జలమయం కాగా.. కాలువలు పొంగిపొర్లుతున్నాయి. వర్షాలపై అధికారులు అప్రమత్తమయ్యారు. పేరూరు చెరువు నీటిని పాతకాల్వ నుంచి స్వర్ణముఖిలోకి మళ్లిస్తున్నారు. తిరుపతిలోకి నీరు రాకుండా మట్టికట్ట ఏర్పాటు చేశారు. తుమ్మలగుంట వైపు వరద నీటిని మళ్లిస్తున్నారు. Visit my blog from last news:- Click here

పెళ్లికాకున్నా.. పిల్లలను దత్తత తీసుకుంటా

Image
  పెళ్లికాకున్నా.. పిల్లలను దత్తత తీసుకుంటా:  నటి బాలీవుడ్ నటి స్వర భాస్కర్.. అనాథ పిల్లలను దత్తత తీసుకోవాలనుకుంటున్నట్లు తెలిపింది. 'నాకు పెళ్లి కాకున్నా కుటుంబం, పిల్లలు కావాలి. అనాథాశ్రమాల్లో ఉండే పిల్లల బాధలు నాకు తెలుసు. నా నిర్ణయానికి నా తల్లిదండ్రులు కూడా ఆమోదించారు అని తెలిపింది. ఇటీవల దీపావళి పండుగను ఢిల్లీలోని ఓ అనాథాశ్రమంలో ఆమె జరుపుకుంది. కాగా ప్రస్తుతం స్వర భాస్కర్ 'షీర్ కుర్మా' అనే షార్ట్ ఫిలింలో నటిస్తోంది. Visit my blog for latest news:- Click here

Farm Laws ప్రధాని ఆకస్మిక ప్రకటన

Image
Farm Laws ప్రధాని ఆకస్మిక ప్రకటన   నూతన సాగు చట్టాలను వెనక్కు తీసుకుంటున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రకటనపై  బీజేపీ  సీనియర్ నేత ఉమాభారతి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకుంటామని ప్రధాని నరేంద్ర మోదీ ఆకస్మికంగా చేసిన ప్రకటనతో తనకు నోటి మాట రాలేదని ఆమె అన్నారు. చట్టాల ప్రయోజనాలను రైతులకు సరిగ్గా వివరించడంలో పార్టీ కార్యకర్తలు వైఫల్యాన్ని ఈ చర్యను ప్రతిబింబిస్తోందని ఈ మేరకు  ఉమా భారతి  ట్విట్టర్‌లో వ్యాఖ్యానించారు. అంతేకాదు, ఇప్పటి వరకూ ఏ ప్రభుత్వం తీసుకొచ్చిన విధానాలూ దేశంలోని రైతులను సంతృప్తిపరచలేకపోయాయని ఆమె పేర్కొన్నారు. ‘‘గత నాలుగు రోజుల నుంచి వారణాసిలోని గంగా నది ఒడ్డున ఉన్నాను... మూడు సాగు చట్టాలను వెనక్కు తీసుకుంటున్నట్టు నవంబరు 19న ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రకటనతో నోటిమాట రాలేదు.. కాబట్టి మూడు రోజుల తర్వాత నేను ఆలస్యంగా స్పందిస్తున్నాను’’అని ఆమె ట్వీట్ చేశారు. మూడు సాగు చట్టాలను ఉపసంహరించుకుంటామని ప్రకటన చేస్తున్నప్పుడు ప్రధానమంత్రి చెప్పిన విషయాలు తనను బాధకు గురిచేసిందని అన్నారు. ‘‘ప్రధానమంత్రి నరేంద్రమోదీ ...

కర్నూలు జిల్లాలో దారుణం.. హత్య చేసి నేరుగా పోలీస్ స్టేషన్‌కే..

Image
  కర్నూలు జిల్లాలో దారుణం.. హత్య చేసి నేరుగా పోలీస్ స్టేషన్‌కే.. కర్నూలు జిల్లాలో దారుణ హత్య చోటు చేసుకుంది. వివాహేతర సంబంధం ఓ వ్యక్తి ప్రాణాలను బలిగొంది. అతికిరాతంగా చంపేసి నిందితుడు పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఎమ్మిగనూరు పట్టణ పరిధిలోని స్థానిక LLC కాలువ దగ్గర హనుమపురం గ్రామానికి చెందిన గొల్ల గోవింద్ (35) అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. రామాంజనేయులు (40) అనే వ్యక్తి అతడిని అతి కిరాతకంగా కొడవలితో నరికి చంపేశాడు. హత్య అనంతరం నిందితుడు నేరుగా రూరల్ పోలీస్ స్టేషన్‌కు వచ్చి లొంగిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతుడిది పెద్దకడుబూర్ మండలం హనుమపురం గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. వివాహేతర సంబంధం నేపథ్యంలోనే హత్య జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. visit my blog  https://way2latesttelugunews.blogspot.com

ఐపీఎల్ 2022లో బ్రావో ఉంటాడు: CSK

  ఐపీఎల్ 2022లో బ్రావో ఉంటాడు: CSK ఇటీవల ఇంటర్నేషనల్ క్రికెట్కు వీడ్కోలు పలికిన వెస్టిండీస్ క్రికెటర్ డ్వేన్ బ్రావో వచ్చే ఐపీఎల్ సీజన్లో ఆడతాడని చెన్నై సూపర్ కింగ్స్ స్పష్టం చేసింది. అయితే.. ఏ జట్టు తరఫున ఆడతాడనే విషయాన్ని వెల్లడించలేదు. కాగా.. తన మ్యాజిక్తో ఎన్నో మ్యాచుల్లో CSKను గెలిపించిన బ్రావోను రిటైన్ చేసుకోవాలని చెన్నై భావిస్తున్నట్లు తెలుస్తోంది. CSK తరఫున బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో బ్రావోకు మంచి రికార్డులున్నాయి.

'ఆ హీరోయిన్ను మెంటల్ హాస్పిటల్కు తరలించాలి'

Image
  'ఆ హీరోయిన్ను మెంటల్ హాస్పిటల్కు తరలించాలి' వివాదాస్పద నటి కంగనా రనౌత్పై కేసు నమోదైంది. రైతులపై అవమానకర వ్యాఖ్యలు చేసిన కంగనపై చర్యలు తీసుకోవాలని, తన పద్మశ్రీ అవార్డును వెనక్కి తీసుకోవాలని ఢిల్లీ సిఖ్ గురుద్వారా కమిటీ డిమాండ్ చేసింది. ఖలిస్థానీ ఉగ్రవాదుల వల్లే కేంద్రం మూడు చట్టాలను రద్దు చేసిందని స్టేట్మెంట్ ఇవ్వడం రైతులను అవమానపరచడమేనంది. కంగనాను మెంటల్ హాస్పిటల్ లేదా జైలుకు తరలించాలని డిమాండ్ చేశారు కమిటీ నేతలు. for more news click here