Farm Laws ప్రధాని ఆకస్మిక ప్రకటన
Farm Laws ప్రధాని ఆకస్మిక ప్రకటన నూతన సాగు చట్టాలను వెనక్కు తీసుకుంటున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రకటనపై బీజేపీ సీనియర్ నేత ఉమాభారతి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకుంటామని ప్రధాని నరేంద్ర మోదీ ఆకస్మికంగా చేసిన ప్రకటనతో తనకు నోటి మాట రాలేదని ఆమె అన్నారు. చట్టాల ప్రయోజనాలను రైతులకు సరిగ్గా వివరించడంలో పార్టీ కార్యకర్తలు వైఫల్యాన్ని ఈ చర్యను ప్రతిబింబిస్తోందని ఈ మేరకు ఉమా భారతి ట్విట్టర్‌లో వ్యాఖ్యానించారు. అంతేకాదు, ఇప్పటి వరకూ ఏ ప్రభుత్వం తీసుకొచ్చిన విధానాలూ దేశంలోని రైతులను సంతృప్తిపరచలేకపోయాయని ఆమె పేర్కొన్నారు. ‘‘గత నాలుగు రోజుల నుంచి వారణాసిలోని గంగా నది ఒడ్డున ఉన్నాను... మూడు సాగు చట్టాలను వెనక్కు తీసుకుంటున్నట్టు నవంబరు 19న ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రకటనతో నోటిమాట రాలేదు.. కాబట్టి మూడు రోజుల తర్వాత నేను ఆలస్యంగా స్పందిస్తున్నాను’’అని ఆమె ట్వీట్ చేశారు. మూడు సాగు చట్టాలను ఉపసంహరించుకుంటామని ప్రకటన చేస్తున్నప్పుడు ప్రధానమంత్రి చెప్పిన విషయాలు తనను బాధకు గురిచేసిందని అన్నారు. ‘‘ప్రధానమంత్రి నరేంద్రమోదీ ...